టేబుల్ టాపర్గా సౌత్ ఆఫ్రికా.. సెమీస్ బెర్త్ ఖాయమైనట్లే?

praveen
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కొనసాగుతుంది సౌతాఫ్రికా జట్టు. అరవీర భయంకరమైన ఈ జట్టు తప్పకుండా టైటిల్ గెలిచి తీరుతుందని చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇటీవల కాలంలో సౌత్ ఆఫ్రికా ఎప్పుడు ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అని ముందుగా ఊహించడం నిజంగానే కష్టంగా మారింది. దీంతో వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా ప్రస్థానం ఎలా కొనసాగుతుందో అనేదానిపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు ఒక మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో ఈ టీం గెలవడం కష్టమే.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందో లేదో అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు.


 అది కూడా నెదర్లాండ్స్ లాంటివి చిన్న టీం చేతిలో 69 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్కు వెళ్ళిన కష్టమే అని భావించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఈ టీమ్ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ భారీ విజయాలు సాధిస్తూ దూసుకు వచ్చింది. ఈ క్రమంలోనే పాయింట్లు పట్టికలో అంతకు అంతకు పైకి ఎగబాకుతూ మిగతా టీమ్స్ అన్నిటికి కూడా షాక్ ఇచ్చింది. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోను హోరాహోరీగా పోరాడి ఒక వికెట్ తేడాతో విజయం సాధించి పాయింట్లు పట్టికలో భారత జట్టును వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వెళ్లిపోయింది.



 ఇటీవల జరిగిన మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విభాగం ముందు ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. కేవలం 270 పరుగులకే కుప్పకూలింది. అయితే 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు కెప్టెన్ మార్కరమ్ 91, బవుమ 28, డికాక్ 24, డసేన 21, మిల్లర్ 29, జాన్సన్ 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. అయితే కెప్టెన్ మార్కరమ్ మళ్లీ ఫామ్ లోకి రావడం మాత్రం ఆ జట్టుకు శుభ సూచికమని చెప్పాలి.  అతను కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే పాయింట్ల  పరంగా రన్ రేట్ పరంగా సౌత్ ఆఫ్రికా దాదాపు సెమీఫైనల్ లో అడుగుపెట్టినట్లే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: