టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. షాకిచ్చిన పోలీసులు?
దీంతో ఇక క్రికెటర్లు అందరూ కూడా క్రికెట్ ద్వారా వచ్చిన ఆదాయం కంటే అటు వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తుంటారు. ఇలాంటి కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిన తర్వాత ఇక ఎలాంటి లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్ల దగ్గర ఉండే లగ్జరీ కార్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతు ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలాంటి లగ్జరీ కార్లను వాడే క్రికెటర్లు కొన్ని కొన్ని సార్లు అతివేగంతో డ్రైవింగ్ చేసి చివరికి ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. గతంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఇలాగే అతివేగం కారణంగా చివరికి ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాల పాలయ్యాడు.
అయితే ఇలాంటి అతివేగంతోనే ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. భారత కెప్టెన్ రోహిత్ కు పోలీసులు జరిమానా విధించారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి హెలికాప్టర్ లో వెళ్లగా.. అక్కడి నుంచి పూణేకి తన లంబోర్ఘిని కారులో వెళ్ళాడు రోహిత్ శర్మ. అయితే ఈ ఎక్స్ప్రెస్ హైవేలో రోహిత్ 200 నుంచి 215 కిలోమీటర్ల వేగంతో కార్ డ్రైవ్ చేయడంతో పోలీసులు మూడు చలాన్లు విధించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు.. రోహిత్ భాయ్ అతివేగం వద్దు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.