కోహ్లీని గెలికితే.. జరిగేది అదే : బంగ్లా క్రికెటర్
100 రెడ్ బుల్స్ ఒకేసారి తాగేసాడేమో అనే అంత ఎనర్జీ విరాట్ కోహ్లీ లో ఎప్పుడూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఎనర్జీనే కోహ్లీ జోలికి వెళ్ళాలి అంటే ప్రత్యర్ధులను భయ పెడుతూ ఉంటుంది. అందుకే అందరూ ఆటగాళ్ల తో కవ్వింపులకు సిద్ధమయ్యే ప్రత్యర్థి జట్ల.. ఆటగాళ్లు విరాట్ కోహ్లీతో పెట్టుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే కోపం వస్తే ఏకంగా పీడకలను మిగిల్చే రేంజిలో రివేంజ్ తీర్చుకుంటాడు కోహ్లీ అనే విషయం అందరికీ తెలుసు. అందుకే సాధ్యమైనంత వరకు విరాట్ కోహ్లీ జోలికి వెళ్లకుండా ఉండడానికే ఇక ప్రత్యర్థి ప్లేయర్లు ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి.
ఇక ఇదే విషయం గురించి బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పికర్ రహీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ పోటీ తత్వం కలిగిన క్రికెటర్ అని ఎప్పుడూ ఓడిపోవాలని అనుకోడు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతన్ని స్లెడ్జింగ్ చేస్తే మరింత ఉత్సాహంతో దూకుడుగా ఆడతాడు అంటూ తెలిపాడు. అందుకే తాను ఎప్పుడు విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేయనని తెలిపాడు. అయితే అతనితో పోటీ పడటం మాత్రం.. ఎప్పుడు ఇష్టమే అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ పై ఇప్పటివరకు26 మ్యాచ్ లలో 1467 పరుగులు చేశాడు. 65.31 సగటుతో ఈ పరుగులు సాధించడం గమనార్హం.