శ్రేయస్.. ఒక్క సింగిల్ ప్లీజ్.. కోహ్లీ స్పెషల్ రిక్వెస్ట్?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ ఉత్కంఠలో భాగంగానే టీమిండియా ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలా ఇస్తూ ఇక విజయం సాధిస్తూ దూసుకుపోతూ ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం వరుసగా మ్యాచ్ లలో   విజయం సాధించి పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.


 అయితే ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా 63 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల   నష్టానికి 272 పరుగులు చేసింది. జస్ ప్రీతి బుమ్రా నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు అని చెప్పాలి. భారత జట్టు రెండే రెండు వికెట్లు నష్టానికి 273 పరుగులను 35 ఓవర్లలో చేదించింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు.



 ఇక విరాట్ కోహ్లీ 55 బంతులో 56 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇక లక్ష్య  చేదనలో 34 ఓవర్లు ముగిసిన సమయానికి భారత్ స్కోరు 251 గా ఉండగా.. క్రీజ్ లో విరాట్ కోహ్లీ (44) శ్రేయస్ (24) ఉన్నారు. అయితే భారత్ విజయానికి ఇంకా 12 పరుగులు అవసరం కాగా కోహ్లీ హాఫ్ సెంచరీకి  ఒక సిక్స్ అవసరం అయింది. దీంతో అప్పడికి శ్రేయస్సు అయ్యర్ ఒకసారి  సిక్స్ కొట్టగా మీకు అతడే మ్యాచ్ ఫినిష్ చేస్తాడేమో అనుకున్న కోహ్లీ ఒక సింగిల్ కావాలి అంటూ శ్రేయస్ అయ్యర్ ను అడిగాడు. దీంతో శ్రేయస్  ఒక సింగిల్ తీసి ఇవ్వడంతో ఇక విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: