షాకింగ్ : టీమిండియా కెప్టెన్ పై.. రెండు మ్యాచ్ల నిషేధం?
అయితే అంపైర్ల నిర్ణయం పై అసంతృప్తి ఉన్నప్పటికీ ప్లేయర్లు బావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ నిరాశతోపే విలియం చేరడం చూస్తూ ఉంటాం. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం ఇక సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించడంతో అందరూ షాక్ అయ్యారు. ఏకంగా ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న ప్లేయర్ ఇలా ప్రవర్తించడమేంటి అంటూ ఎంత మంది మాజీలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఆ సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ కాస్త హుందాగా ప్రవర్తించాల్సింది అంటూ మాజీలు సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇలా ప్రవర్తన నియమావలికి విరుద్ధంగా ప్రవర్తించిన హర్మన్ ప్రీత్ కౌర్ పై అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చర్యలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే మ్యాచ్ మధ్యలో అవుట్ కాగానే వికెట్లను బ్యాట్తో కొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్ పై రెండు అంతర్జాతీయ మ్యాచ్లో నిషేధం విధించబోతున్నట్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. అయితే ఔట్ అయినా తర్వాత వికెట్లను బ్యాట్ తో తన్నగా.. ఇక తన తప్పును ప్యానెల్ ముందు హర్మన్ ప్రీత్ కౌర్ అంగీకరించినట్లు ఐసీసీ తెలిపింది. దీంతో ఈ విషయంపై ఎలాంటి విచారణ జరపకుండానే ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాము అంటూ స్పష్టం చేసింది ఐసిసి. అయితే మ్యాచ్ మధ్యలో బ్యాట్ తో వికెట్లను తన్నడమే కాదు అటు మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా అంపైరింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది హర్మన్ ప్రీత్ కౌర్.