అతనికి కూడా ఓ రోజు వస్తుంది : ఇర్ఫాన్ పఠాన్

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే అక్కడ మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆడబోయే టెస్ట్ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కు సంబంధించిన జట్టు వివరాలను కూడా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా జట్టు. అయితే ఇక ఇటీవలే వెస్టిండీస్తో టి20 సిరీస్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇక అందరూ ఊహించినట్లుగానే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది టీమిండియా.

 ఇకపోతే వెస్టిండీస్తో జరగబోయే టి20 సిరీస్ లో భాగంగా ఎంతో మంది యంగ్ క్రికెటర్లకు ఛాన్స్ దక్కింది అని చెప్పాలి. ఇలా చాన్స్ దక్కించుకున్న వారిలో గత కొన్ని ఐపిఎల్ సీజన్స్ నుంచి నిలకడైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఐపిఎల్ లో సంచలన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్న యశస్వి జైష్వాల్ కూడా టి20 జట్టులో అవకాశం దక్కించుకున్నాడు అని చెప్పాలి. అయితే సూపర్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న రింకు సింగ్ కీ కూడా జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో సెలెక్టరు మాత్రం రింకు సింగ్ ని పట్టించుకోలేదు.

 దీంతో ఇక రింకు సింగ్ అభిమానులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. అయితే వెస్టిండీస్ పర్యటనలో ఆడబోయే టి20 సిరీస్ కోసం రింకు సింగ్ ను ఎంపిక చేయకపోవడం గురించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. త్వరలోనే రింకు కీ టైం కూడా వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే రింకు సింగ్ ని ఎంపిక చేయకపోవడంపై అటు ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్టులు పెడుతున్నారు అని చెప్పాలి. రింకు సింగ్ మరో సర్ఫరాజ్ కాకూడదు.. అతనికి ఇప్పుడే అవకాశాలు ఇవ్వాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: