మాజీ క్రికెటర్ ఝాలన్ గోస్వామికి.. అరుదైన గౌరవం?
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలకుండా దేశం కోసం వీరోచిత పోరాటం చేశారు ఆమె. ఇలా భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఆమె ఒక లెజెండరీ క్రికెటర్ గా మిగిలిపోయారు అని చెప్పాలి. ఇక ఆమె స్ఫూర్తితోనే ఎంతోమంది క్రికెట్ నే ప్యాషన్ గా ఎంచుకొని ప్రస్తుతం భారత మహిళా క్రికెట్లో రాణిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ కి సేవలు అందించిన భారత మాజీ క్రికెటర్ జులాన్ గోస్వామికి ఇటీవలే ఒక అరుదైన గౌరవం లభించింది. దీంతో ఈ విషయం గురించి తెలిసి అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు.
ఎమ్సిసి వరల్డ్ క్రికెట్ కమిటీలో సభ్యురాలిగా ఎంపికైంది భారత మహిళా మాజీ క్రికెటర్ జులాన్ గోస్వామి. ఆమెతోపాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్, ఇంగ్లాండు మహిళా మాజీ కెప్టెన్ హీథర్ నైట్ కి కూడా ఈ కమిటీలో చోటు దక్కింది అని చెప్పాలి. కాగా MCC అనేది ఒక స్వచ్ఛంద సంస్థ ఇందులో మాజీ క్రికెటర్లు ప్రస్తుత క్రికెటర్లతో పాటు ఇక అంపైర్లు కూడా సభ్యులుగా ఉంటారు అని చెప్పాలి. ఈ స్వచ్ఛంద సంస్థలో సభ్యత్వం దక్కడాన్ని క్రికెటర్లు గౌరవంగా భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆ అరుదైన గౌరవం భారత మాజీ క్రికెటర్ జులాన్ గోస్వామికి దక్కింది అని చెప్పాలి.