కోహ్లీ, డూప్లెసిస్ ఓపెనింగ్ జోడి.. అరుదైన రికార్డ్?
అయితే అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే ఆర్సిబి అద్భుతమైన ఆట తీరును కనపరిచింది అని చెప్పాలి. ఒకవైపు బెంగళూరు జట్టు ఓపెనర్ విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగితే ఇక మరో ఓపనర్ డూప్లెసెస్ కూడా అదిరిపోయే ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సన్రైజర్స్ తమ ముందు ఉంచిన టార్గెట్ ను ఎంతో అలవోకగా ఛేదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఇటీవల అటు సన్రైజర్స్ పై గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడమే కాదు ఆర్సిబి ఓపెనర్స్ కోహ్లీ డూప్లెసెస్ అరుదైన రికార్డును సృష్టించారు అని చెప్పాలి.
ఐపీఎల్ హిస్టరీలో ఏడుసార్లు 50 కంటే ఎక్కువ భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును సమం చేశారు విరాట్ కోహ్లీ, డూప్లెసెస్ ఓపెనింగ్ జోడి. అంతకుముందు డేవిడ్ వార్నర్, బెయిర్ స్ట్రో 2019లో ఏడుసార్లు 50 కన్నా ఎక్కువ భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా ఉండగా.. ఇక 2021లో డూప్లెసెస్ రుతురాజు గైక్వాడ్ జోడి ఇక ఈ రికార్డును సమం చేసింది. ఇక ఇటీవల కోహ్లీ, డూప్లెసిస్ జోడి 50 కి పైగా పరుగులు చేసి ఇలా ఏడుసార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ఓపెనింగ్ జోడీగా వారి సరసన నిలిచింది అని చెప్పాలి. అంతేకాదు 100 ప్లస్ భాగస్వామ్యాన్ని ఈ జోడి ఇప్పుడు వరకు నాలుగు సార్లు చేశారు అని చెప్పాలి.