భారత్ పై గెలిచేందుకు.. నేను సాయం చేస్తా : ఆసిస్ మాజీ

praveen
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆతిథ్య టీమిండియా జట్టుతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై అందులో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి. ఈ రెండు మ్యాచ్లలో కూడా ఆస్ట్రేలియా జట్టు ఎక్కడ ప్రభావం చూపలేకపోయింది. ఆతిథ్య టీమ్ ఇండియాకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో కూడా ఘోర పరాజయం చవిచూసింది.


 ఈ క్రమంలోనే  ఆస్ట్రేలియా జట్టుపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ లపై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లందరూ కూడా చేతులెత్తేస్తూ ఉన్నారు. భారత బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా పరుగులు రాబట్టడానికి ముప్పు తిప్పలు పడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వరుస ఓటములపై ఎంతోమంది ఆ దేశ మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఆస్ట్రేలియా జట్టుకు సలహాలు సూచనలు ఇస్తున్నారు అని చెప్పాలి. ఎలాంటి వ్యూహాలతో బలిలోకి దిగితే ఆస్ట్రేలియా భారత్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలదు అనే విషయంపై ఇప్పటికే పలువురు సూచనలు ఇచ్చారు. కాగా ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ స్పందించాడు.


 భారత్ చేతిలో వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టుకు తాను సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మ్యాథ్యూ హెడెన్  కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఎప్పుడు కలిసిన సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దీనికోసం ఒక్క రూపాయి కూడా తీసుకోను అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టును సొంత గడ్డపై ఓడించడం అంత సులువు కాదని తెలిపాడు. అయితే భారత బౌలర్ల మైండ్ సెట్ ను ముందుగా అర్థం చేసుకోవాలి అంటూ సూచించాడు మ్యాథ్యూ హెడెన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: