ఆస్ట్రేలియా చేసిన ఆ తప్పులే.. ఓటమికి కారణం : క్లార్క్

praveen
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. అయితే అప్పటికే ఆస్ట్రేలియా జట్టు ఎంతో పటిష్టంగా ఉండడం.. ఇక ఆ జట్టులోని ఆటగాళ్లందరూ కూడా మంచి ఫామ్ లో ఉండడంతో భారత పర్యటనకు వచ్చి ఆతిధ్య భారత జట్టుకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని ఎంతోమంది అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో భారత్ అంతకు మించిన ప్రదర్శన చేస్తూ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ లపై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఎక్కడ ప్రభావం చూపలేకపోతున్నారు.

 దీంతో భారత బౌలింగ్ విభాగం దాటికి అటు ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం మొత్తం పేకామెడలా కుప్పకూలిపోతోంది అని చెప్పాలి.. వరుసగా వికెట్లు కోల్పోతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పటివరకు భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్లు జరగగా.. రెండూ టెస్ట్ మ్యాచ్ లలో కూడా భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో 132 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇక రెండవ టెస్టు మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా ఆస్ట్రేలియా జట్టు బలిలోకి దిగడం పెద్ద తప్పిదం అంటూ చెప్పుకొచ్చాడు. అదేవిధంగా తొలి టెస్ట్ లో తుది జట్టు ఎంపికలో ఆస్ట్రేలియా సెలెక్టర్లు తప్పు చేశారు. అంతేకాకుండా రెండవ టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లందరూ కూడా స్పిన్ బౌలింగ్లో స్వీప్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి చివరికి పొరపాటు చేశారు. స్పిన్ బౌలింగ్ లో ఎప్పుడు స్వీప్ షాట్ ఆడకూడదని స్ట్రైట్ బ్యాట్ ఆడాలి అంటూ సూచించాడు. ఈ తప్పులే ఆస్ట్రేలియా ఓటమికి కారణం అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: