సన్రైజర్స్ నన్ను కొనగానే.. అమ్మ, అమ్మమ్మ ఏడ్చేశారు?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేలం ప్రక్రియ ముగిసింది . ఈ క్రమంలోనే ఈ మినీ వేలంలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉండడంతో భారీ ధర పలకడం ఖాయమని అందరూ అంచనాలు పెట్టుకుంటే.. ఇక గత మెగా వేలంలో లాగానే అందరి అంచనాలు తారుమారు అయ్యాయి అని చెప్పాలి. స్టార్ ప్లేయర్లందరిని కూడా తక్కువ ధరకే ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే అటు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతూ తమని తాము నిరూపించుకుంటున్న యువ ఆటగాళ్లకు మాత్రం భారీ ధర వెచ్చించేందుకు పోటీపడ్డాయి అన్ని ఫ్రాంచైజీలు.


 ఎంతో మంది యువ ఆటగాళ్లు రికార్డు ధర పలికారు అని చెప్పాలి. ఇలా ఎవరి ఊహకందని విధంగా భారీతర సొంతం చేసుకున్న ఆటగాళ్లలో హారి బ్రూక్స్ కూడా ఉన్నాడు. గత కొంతకాలం నుంచి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హారి బ్రూక్స్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు.  ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టులో పవర్ హిట్టర్ గా పేరు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఎన్నో రోజుల నుంచి ఒక మంచి పవర్ హిట్టర్ కోసం వెతుకుతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు ఇక హారి బ్రూక్స్ ఆటతీరు తెగ ఆకర్షించింది. దీంతో అతని కోసం పోటీపడి మరి భారీ ధర వెచ్చించింది సన్రైజర్స్.


 13.25 కోట్లకు కొనుగోలు చేసింది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ మినీ వేలంలో అధిక ధర పలకడం పై ఇంగ్లాండు బ్యాట్స్మెన్ హారి బ్రూక్స్ స్పందించాడు.  నన్ను ఐపీఎల్లో భారీ ధరకు సెలెక్ట్ చేయడంపై నా దగ్గర మాటలు లేవు. నేను మా అమ్మ అమ్మమ్మతో కలిసి భోజనం చేస్తుండగా సన్రైజర్స్ నన్ను 13.25 కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసింది. ఇక ఆ ఆనందంలో అమ్మ అమ్మమ్మ ఏడవడం మొదలుపెట్టాడు. నాకైతేసంతోషంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అంటూ హారి బ్రూక్స్ చెప్పుకొచ్చాడు. ఇక అతను సన్రైజర్స్ జట్టులో ఎలా రానిస్తాడు అన్న విషయంపై అభిమానుల్లో  కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: