నా ఓటు సూర్యకుమార్ కే.. అతనే బెస్ట్ : బట్లర్
ఇక తమ అభిప్రాయం ప్రకారం ఎవరు ఐసిసి టి20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును దక్కించుకుంటారు అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు అని చెప్పాలి.. అయితే ఇప్పటికే భారత స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసి ఫిదా అయ్యాను అంటూ ప్రశంసలు కురిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ ఇక ఇప్పుడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కించుకునేది తప్పకుండా సూర్య కుమార్ యాదవ్ అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. నా దృష్టిలో ఈ టి20 ప్రపంచ కప్ లో సూర్యనే ఉత్తమ ఆటగాడు. అతను చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. స్టార్లతో నిండి ఉన్న భారత బ్యాటింగ్ లైన్ అప్ లో సూర్య ఆట అందరిని కట్టిపడేసింది అంటూ బట్లర్ చెప్పుకొచ్చాడు.
అయితే బట్లర్ వ్యాఖ్యలతో అటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ మాత్రం ఏకీభవించలేదు అని చెప్పాలి. తమ జట్టు ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ కె ప్లేయర్ ఆఫ్ ది టోర్ని అవార్డు దక్కుతుంది అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ అవార్డు కోసం 9 మందితో తుది జాబితాను ఎంపిక చేయగా.. ఇక ఐసీసీ ఎంపిక చేసిన లిస్టులో ఇంగ్లాండ్ పాకిస్తాన్ కు చెందిన ఆటగాల్లే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. మరీ ఈ ఏడాది ప్రేయర్ ఆఫ్ ది టోర్ని ఎవరికి దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.