మరో ఓపెనర్ లేడు.. ఓపిక పట్టాల్సిందే : గవాస్కర్

praveen
టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతూ మంచి ఆరంభాలను ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర వహించే కేఎల్ రాహుల్ ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో మాత్రం టీమిండియా కు భారంగా మారిపోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు టీమిండియా వరల్డ్ కప్ లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడింది. అయితే ఈ మూడు మ్యాచ్లలో కూడా కేఎల్ రాహుల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. భారీ అంచనాల మధ్య బ్యాటింగ్ చేసేందుకు రావడం ఇక ఆ తర్వాత సింగిల్ డిజిట్ స్కోర్కె పెవీలియన్ చేరడం లాంటివి చేశాడు కేఎల్ రాహుల్.


 పాకిస్తాన్ తో మ్యాచ్లో 9 పరుగులు చేసి వికెట్ చేజార్చుకున్న  రాహుల్ ఇక నెదర్లాండ్స్ తో మ్యాచ్లో నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. మొన్నటికి మన దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో కూడా 9 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. దీంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతన్ని వెంటనే జట్టు నుంచి తప్పించాలి అంటూ ఎంతో మంది డిమాండ్స్ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫామ్ విషయం పక్కన పెడితే కేఎల్ రాహుల్ కూ మానసిక ఇప్పుడునైనా కోచ్ అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 పాడి ఆప్టన్ లాంటి మానసిక నిపుణుడైన కోచ్ మనకు ఉన్నాడు. ఆత్మవిశ్వాసం పెరగాలన్న ఆటలో రాణించాలన్న ప్రస్తుతం రాహుల్ కి అతడి అవసరం ఎంతో ఉందని నేను అనుకుంటున్నా.  పాడి ఆప్టన్ తో మాట్లాడించి కేఎల్ రాహుల్ కూ అతనిలో దాగున్న ప్రతిభ ఏమిటో గుర్తు చేయాలి. ఇప్పటివరకు మనం ఆడింది కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే. సూపర్ 12 లో ఇంకా మ్యాచ్లో మిగిలి ఉన్నాయి. కేఎల్ రాహుల్   లాంటి మరో ఓపెనర్ టీమ్ ఇండియాకు లేడు. అతని ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. అందుకే కాస్త ఓర్పు వహించాలిఅంటూ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: