వైరల్ : చిన్నపిల్లాడిలా మారిన సునీల్ గవస్కర్?
అయితే భారత జట్టు విజయం సాధించిందని తెలియగానే ఇక అటు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే తమ అందరికీ కూడా ఒకరోజు ముందుగానే దీపావళి వచ్చేస్తుంది అని తెగ సంబరపడిపోయారు అని చెప్పాలి. ఇక టీమ్ ఇండియా విజయాన్ని అభిమానులు ఎంతోమంది ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పాలి ముందుగానే పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే కేవలం క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు ఎంతోమంది మాజీ క్రికెటర్లు సైతం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ ను కన్నారపకుండా వీక్షించారూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలోనే భారత లెజెండరీ ఆటగాడు సునీల్ గావాస్కర్ సైతం టీమిండియా విజయం సాధించడంతో ఆనందంతో ఊగిపోయాడు. ఏకంగా చిన్నపిల్లాడిలాగా తన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అని చెప్పాలి. టీమిండియా విజయం పై సంతోషం పట్టలేకపోయిన సునీల్ గవాస్కర్ ఏకంగా స్టేడియంలో చిన్న పిల్లాడి లాగా ఎగిరి గంతులు వేస్తూ డాన్సులు చేశాడు. ఇక అతనితో ఇర్ఫాన్ పట్టాను కూడా జత కలిశాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.