యూఏఈ గెలిచింది.. నెదర్లాండ్స్ క్వాలిఫై అయింది?
అయితే ఇటీవల జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లు యూఏఈ గెలవడం ద్వారా అటు నెదర్లాండ్స్ కి అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పాలి. ఒకవేళ నమీబియా గెలిచి ఉంటే మాత్రం నెదర్లాండ్స్ సూపర్ 12 అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయేది. అయితే గ్రూప్ బి నుంచి ఇక సూపర్ 12లో అడుగుపెట్టే మరో రెండు జట్లు ఏవో తెలుసుకోవాలంటే మాత్రం ఇక మరిన్ని క్వాలిఫైయర్ మ్యాచ్లు జరగాల్సిందే అని చెప్పాలి. కాగా సూపర్ 12 కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో నమిబియా చివరి వరకు పోరాడి ఓడిపోయింది. డూ ఆర్ డై మ్యాచ్లో 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు 8 వికెట్లను నష్టానికి 141 పరుగులు మాత్రమే చేసింది.
ఇక తద్వారా ఏడు పరుగులు తేడాతో యూఏఈ విజయం సాధించింది అని చెప్పాలి. అయితే అప్పటికే యూఏఈ వరుసగా రెండు పరాజయాల మూట కట్టుకోవడంతో ఇక చివరి మ్యాచ్లో గెలిచినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అయితే యూఏఈ అటు నమీబియా ను ఓడించినందుకుగాను అటు నెదర్లాండ్స్ కూ మాత్రం బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. తమకు పోటీగా ఉన్న నమీబియా ఓడిపోవడంతో ఇక శ్రీలంక తర్వాత అటు సూపర్ 12 మ్యాచ్లు ఆడేందుకు అర్హత సాధించింది నెదర్లాండ్స్ జట్టు. ఇక గ్రూపు బీలో భాగంగా స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు పోటీ పడుతూ ఉన్నాయి. ఇక వీటిలో ఏ రెండు జట్లు సూపర్ 12 మ్యాచ్లకు అర్హత సాధిస్తాయో చూడాలి.