కార్తీక్ భాయ్.. ఇలా అయితే వరల్డ్ కప్ లో కష్టమే?

praveen
టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో మరోసారి హోరాహోరీగా తరబడేందుకు సిద్ధమవుతుంది టీమిండియా జట్టు. ఇక అంతకు ముందు గానే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ప్రాక్టీస్ మ్యాచ్లో మునిగి తేలుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది టీం ఇండియా.. ఈ మ్యాచ్ లో భాగంగా ఆరు పరుగులు తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా మొదటి బ్యాటింగ్ చేసింది టీమిండియా.


 ఇకపోతే  ఓపెనర్ కేఎల్ రాహుల్ 57 పరుగులతో రానించగా మిడిల్ ఆర్డర్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 50 పరుగులు చేసే ఆర్ధ శతకాలతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది టీమిండియా. ఆ తర్వాత లక్ష్య చేదనకు  దిగిన ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ముఖ్యంగా ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 76 పరుగులతో రాణించాడు. ఇకపోతే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా దినేష్ కార్తీక్ కీపింగ్ పై విమర్శలు వస్తున్నాయి. చాహల్ వేసిన బౌలింగ్లో వచ్చి రాగానే మ్యాక్స్వెల్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.


 కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకింది. దీంతో కీపర్ చేతిలోకి వెళ్ళింది. కానీ దినేష్ కార్తీక్ మాత్రం మ్యాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేశాడు. 11వ ఓవర్లో జరిగిన ఈ ఘటనతో సేవ్ అయిన మాక్స్వెల్ ఇక 16 బంతుల్లోని 23 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  కానీ ఆ తర్వాత 15వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ వైవిద్యమైన బంతిని సంధించి మాక్స్ వెల్ ను బోల్తా కొట్టించాడు. దీంతో కీపర్ దినేష్ కార్తీక్ క్యాచ్ అందుకోవడంతో ఇన్నింగ్స్ కు తెరపడింది. అయితే దినేష్ కార్తీక్ కీపర్ గా ఈజీ క్యాచులు మిస్ చేస్తూ ఉండటం ఫాన్స్ ని కలవర పెడుతుంది. ఇక వరల్డ్ కప్ లో ఇలాగే చేస్తే అతనికి తుది జట్టులో చోటు కష్టమే అంటూ వాదనలు కూడా వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: