ఇండియాలో వరల్డ్ కప్.. బీసీసీఐకి వందల కోట్ల నష్టం?
ఈ క్రమంలోనే వచ్చి ఏడాది వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహిస్తే బీసీసీఐకి 995 కోట్ల నష్టం వాటిల్ల అవకాశం ఉందట. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంది అని మాత్రం తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వం గనుక పన్ను మినహాయింపు ఇవ్వకపోతే మాత్రం బీసీసీఐకి వందల కోట్ల నష్టం తప్పదని ఇటీవల ఒక నివేదిక పేర్కొంది.. ఇంతకీ బీసీసీఐకి నష్టం ఎలా వస్తుందో తెలుసుకుందాం. టి20 వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మేజర్ టోర్నీలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో నిర్వహిస్తూ ఉంటుంది ఐసీసీ.
అయితే ఆయా దేశాలలో టోర్నీ నిర్వహించిన సమయంలో పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన బాధ్యత ఆయా దేశాల క్రికెట్ బోర్డులపైనే ఉంటుంది. ఒకవేళ ఆయా దేశాలకు ప్రభుత్వాలు గనక పన్ను మినహాయింపు ఇవ్వకపోతే మాత్రం ఇక క్రికెట్ బోర్డులే నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అగ్రిమెంట్ కారణంగా ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి నష్టాలు పాలు చేసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. వచ్చే సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ ప్రసారాలు ద్వారా సమకూరే ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇక వచ్చే ఆదాయంపై 21.84% పన్ను కూడా విధించింది. ఒకవేళ పన్ను శాతాన్ని తగ్గించిన బీసీసీఐకి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.