తిరుగులేని టీమిండియా.. ఇప్పుడు మరో విజయం?

praveen
గత కొంత కాలం నుండి విషయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విదేశీ పర్యటనకు వెళ్లిన లేదా స్వదేశంలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడిన విజయ డంకా మోగించడం లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు మరోసారి అదే రీతిలో సత్తా చాటింది అని చెప్పాలి.. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో ఇప్పటికే టి20 సిరీస్ ఆడి విజయ డంకా మోగించిన టీమిండియా ఇటీవల వన్డే సిరీస్ ను కూడా విజయవంతంగా ముగించింది.

 కీలక ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా పయనం అవ్వగా.. ప్రతిభ గల  యువ ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు  మొదటి మ్యాచ్ లో భాగంగా 8 పరుగుల తేడాతో పరాజయం  పాలు అయ్యి నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తర్వాత రెండు మ్యాచ్లలో  మాత్రం అనూహ్యంగా పుంజుకుంది అని చెప్పాలి. రెండో మ్యాచ్లో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా ఇక మూడవ మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించి విజయ డంకా మోగించింది.

 తద్వారా ఇక మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఇక రెండు 2-1 తేడాతో సౌత్ ఆఫ్రికా పై వన్ డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా మూడవ వన్డే మ్యాచ్లో భాగంగా సౌత్ ఆఫ్రికాను కేవలం 99 పరుగులకే ఆల్ అవుట్ చేసింది టీమిండియా. ఆ తర్వాత 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి  దిగిన భారత జట్టు 19.1 ఓవర్ లలో మూడు టికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పాలి. ఇంకా టీమిండియా విజయంలో శుభమన్ గిల్ 49, శ్రేయస్ అయ్యర్  28 పరుగులు చేసి కీలకపాత్ర వహించారు. ఇక టీమిండియా మరో సిరీస్ కైవసం చేసుకోవడంతో జట్టు అభిమానులు అందరూ ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: