షమి తుది జట్టులోకి వస్తాడు.. బిసిసిఐ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు?
టి20 వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల వివరాలను ఇటీవలే బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. ఇక బీసీసీఐ జట్టు ప్రకటనపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంజు శాంసన్ కు చోటు దక్కకపోవడంపై బిసిసిఐ పై విమర్శలు చేస్తూ ఉంటే మరి కొంతమంది షమీ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ను పక్కన పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే పదిహేను మంది సభ్యులలో కాకుండా కేవలం స్టాండ్బై ప్లేయర్గా మాత్రమే షమి నీ బిసిసిఐ ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే..
ఈ క్రమంలోనే అతను టి 20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా తుది జట్టులో అవకాశం దక్కించుకుంటాడ లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల ఇదే విషయంపై ఒక బీసీసీఐ సెలెక్టర్ ఒకరు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. షమి కి 15 మంది సభ్యుల బృందం లోకి వచ్చేందుకు దారులు మూసుకు పోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.. త్వరలో జరగబోతున్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లతో సిరీస్లలో హర్షల్ పటేల్, జస్ప్రిత్ బూమ్రా లలో ఎవరు విఫలమైన కూడా వారి ప్లేస్ లో మహ్మద్ షమీ ఫైనల్ 15 లోకి వస్తాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ సిరీస్ లో మహ్మద్ షమీ కూడా రాణించాల్సి ఉంది తెలిపాడు. పది నెలల పాటు షమి దూరంగా ఉండడం అదే సమయంలో హర్షల్ పటేల్ బాగా రాణించడంతోనే షమికి బదులు హర్షల్ పటేల్ ను తీసుకున్నామని వివరణ ఇచ్చాడు..