టి20 క్రికెట్ లో.. ప్రపంచ నెంబర్.1 గా కొత్త మొనగాడు?
అయితే ఎంతో ప్రేక్షకాదరణ పొందిన టీ-20 ఫార్మెట్లో బాగా రాణిస్తే ఒకవైపు పేరుప్రఖ్యాతులు తో పాటు మరో వైపు ఆదాయం కూడా అదేరీతిలో వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే టీ-20 ఫార్మెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నెంబర్ వన్ స్థానంలో కొనసాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కేవలం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఒకప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానం కోసం పుట్టాడేమో అన్నట్లుగా ఎన్నో నెలల పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు.
కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ నెంబర్వన్ స్థానాన్ని కోహ్లీ నుంచి లాక్కున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కంటే ఎక్కువ కాలమే నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. ఇప్పుడు నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా కొత్త మొనగాడు అవతరించాడు అని తెలుస్తోంది. అతను ఎవరో కాదు పాకిస్థాన్ జట్టు వికెట్ కీపర్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ కావడం గమనార్హం. ఆసియా కప్లో భాగంగా జరిగిన మ్యాచ్ లలో బాగా రాణించిన మొహమ్మద్ రిజ్వాన్ నెంబర్ వన్ స్థానం లోకి వచ్చేశాడు. రిజ్వాన్ 815 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ 794 పాయింట్లతో రెండో స్థానంలోకి పడిపోయాడు. సౌతాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్.. 792 పాయింట్లతో మూడో స్థానంలో.. టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. 775 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.