వారెవ్వా.. సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిత్ శర్మ ఒక్కసారి క్రీజ్లో కుదురుకున్నాడంటే  కేవలం ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగల సత్తా ఉన్న  బ్యాట్స్మన్ అని చెప్పాలి. అంతే కాదు క్రీజ్లో కుదురుకున్నాడంటే రోహిత్ శర్మ సృష్టించే సునామీ ముందు బౌలర్లు సైతం భయపడిపోతుంటారు. స్కోర్ బోర్డు సైతం పరుగులు పెట్టి అలసిపోతా ఉంటుంది అని చెప్పాలి. ఆ రేంజ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు.


 అయితే ఇటీవలి కాలంలో కేవలం బ్యాటింగ్లో మాత్రం కాదు కెప్టెన్సీలో   కూడా రోహిత్ శర్మ ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియాకు వరుస విజయాలు అందిస్తున్నాడు అని చెప్పాలి. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో జట్టుకు విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఆ తర్వాత మాత్రం కీలకమైన మ్యాచ్లలో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.  ఈ క్రమంలోనే  సూపర్ 4లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో చివరికి ఓటమి చవిచూసింది టీమిండియా.


 ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఓటమి పాలు అయినప్పటికీ రోహిత్ శర్మ   మాత్రం పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. బ్యాట్స్మెన్లు అందరూ విఫలమౌతున్న సమయంలో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్ తరఫున ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. మొన్నటివరకు 971 పరుగులతో సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో కొనసాగాడు. ఇక రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ఒక్క వెయ్యి 16 పరుగులతో ఆసియా కప్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా టాప్ ప్లేస్ లోకి వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: