ఆకాష్ చోప్రా చెప్పిందే నిజమైంది.. ఆ జట్టు ఓడిపోయింది?

praveen
ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లో ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు  మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఆ మ్యాచ్ కి సంబంధించి తమ అభిప్రాయాలను వ్యక్త పరచడం ఇటీవల కాలంలో ఒక ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  అంతేకాదు ఆ మ్యాచ్ లో ఎవరు తుది జట్టులోకి వస్తే బాగుంటుంది.. ఇక మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయాలను కూడా ముందుగానే జోస్యం చెబుతున్నారు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఇలా మాజీ ఆటగాళ్లు చెప్పిన జోస్యం మ్యాచ్లో నిజం అవుతూ  ఉండటం గమనార్హం. ఇక ఇలా ప్రతి క్రికెట్ మ్యాచ్ గురించి కూడా స్పందిస్తూ తన విశ్లేషణ చెప్పే భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఇటీవలే ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ మధ్య  జరిగిన మ్యాచ్ కి సంబంధించి చెప్పిన విషయం నిజం అయింది.

 బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చాడు  ఆకాశ్ చోప్రా.  ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా ఎంతో పటిష్టంగా ఉంది అంటూ తెలిపాడు. బంగ్లాదేశ్ జట్టు  బౌలింగ్ పరంగా కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటూ తెలిపాడు. అదృష్టం కలిసి వస్తే తప్పక  బంగ్లాదేశ్ గెలవడం  కష్టమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. చివరికి నిన్న బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆకాశ్ చోప్రా చెప్పిందే నిజమైంది అని చెప్పాలి.

  ఆకాశ్ చోప్రా చెప్పినట్లుగానే బంగ్లాదేశ్ బ్యాటింగ్ విభాగం ఎంతో పేలవమైన ప్రదర్శన  చేసింది. ఈ క్రమంలోనే అటు ఆఫ్ఘనిస్తాన్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్ జట్టు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్  బ్యాట్స్మెన్లను పరుగులు చేయనివ్వకుండా  కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు బంగ్లాదేశ్ బౌలర్లు. కానీ ఆచితూచి ఆడిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు చివరి బంగ్లాదేశ్ తమ ముందు ఉంచిన టార్గెట్ ఛేధించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: