కూల్ గా కనిపించే రాహుల్ ద్రావిడ్ లో.. ఇంత కోపమా.. వైరల్?

praveen
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశాంతత కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. అభిమానులు అందరూ కూడా రాహుల్ ద్రావిడ్ ను మిస్టర్ కూల్ అంటూ పిలుస్తూ ఉంటారు. అయితేఎలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో కూడా తన హావభావాలు బయటకు కనిపించకుండా ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉంటాడు రాహుల్ ద్రావిడ్. ఇక ఈ ఎంతగానో ఎంజాయ్ చేయాల్సిన సమయాన్ని కూడా చిన్న చిరునవ్వుతో సరిపెట్టుకోవడం చేస్తూ ఉంటాడు  అన్న విషయం తెలిసిందే. టీమిండియా జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి దిగ్గజ బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్నాడు రాహుల్ ద్రావిడ్.


 ఇక భారత జట్టులో ఒక ఆటగాడిగా యువకుడిగా ఉన్న సమయంలో కూడా ఎంతో కూల్గానే కనిపిస్తూ ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే తన ప్రశాంతతకు బిరుదుగా రాహుల్ ద్రవిడ్ కు టీమిండియా ది వాల్ అన్న పేరు కూడా సార్థకం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఎంతో కూల్గా కనిపించిన రాహుల్ ద్రావిడ్ ఇటీవలే ఒక్కసారిగా తనలోని కోపాన్ని కూడా బయట పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. టీమ్ ఇండియా వెస్టిండీస్ మధ్య  మొదటి వన్డే మ్యాచ్ జరిగింది.


 నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. చివరి ఓవర్లో 15పరుగులు అవసరమైన సమయంలో మహమ్మద్ సిరాజ్ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఇక ఈ సమయంలోనే స్టాండ్స్ లో కూర్చున్న రాహుల్ ద్రావిడ్ ఫీల్డ్ ప్లేస్మెంట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పక్కన ఉన్న బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తో మాట్లాడుతూ అరే ఏం ఫీలింగ్స్ షేర్ చేశాడు అంటూ కోపంగా విసుక్కున్నాడు. ఇందుకు  సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేస్తూ యాక్షన్ ఎమోషన్స్ మన చేతుల్లో ఉండవు అనడానికి ఇదే నిదర్శనం అంటూ ఒక క్యాప్షన్ జత చేసింది. కాగా మొదటి వన్డే మ్యాచ్లో మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: