భరించలేని నొప్పిని కూడా లెక్క చేయలేదు : సునీల్ గవాస్కర్

praveen
ఇటీవల కాలంలో టీమిండియాలో జరుగుతున్న మార్పులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు అందరికీ కూడా తరచు విశ్రాంతిని ఇస్తూ ఉండడం తో  మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారూ. ఐపీఎల్ టోర్నీ జరిగినన్ని రోజులు రెస్ట్ లేకుండా ఆడే క్రికెటర్లు టీమిండియా ఆడే సమయంలో మాత్రం ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నారు అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా 1974లో కరేబియన్ టూర్లో భాగంగా జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఇక కరేబియన్ టూ లోని సునీల్ గవాస్కర్ అద్భుతమైన ప్రదర్శన తో స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే.

 ఏకంగా కరేబియన్ టూర్ లో భాగంగా 154 స్ట్రైక్ రేట్తో 774 పరుగులు చేసి ఒకే సిరీస్ లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా  నిలిచాడు ఇప్పటికి కూడా ఇదే అత్యధిక పరుగుల రికార్డు గా కొనసాగుతుంది అని చెప్పాలి   అంతేకాదు ఇప్పటి వరకు టెస్టుల్లో 10000 పరుగులు అందుకున్న మొదటి క్రికెటర్గా 34 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ గా కూడా రికార్డులు క్రియేట్ చేసింది సునీల్ గవాస్కర్ అని చెప్పాలి. విండీస్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్లను సైతం ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. అప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తు చేశాడు. అయితే ప్రాక్టీస్ సెషన్ తర్వాత నా జగ్ లో నీళ్లు తాగాలి అని ప్రయత్నించాను.. అందులో ఒక ఐస్ ముక్క నా పంటికి  తగిలింది. అంతే విపరీతమైన నొప్పి.
 ఇక సిరీస్ గెలవడానికి ఎంతో ముఖ్యమైన మ్యాచ్.. ఈ క్రమంలోనే పంటి నొప్పి వేధిస్తున్న ఎలాగైనా ఆడాలని నిర్ణయించుకున్నాం.. నిద్ర పట్టడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ అడిగిన కనీసం పెయిన్ కిల్లర్ ఇవ్వమని అడిగిన మేనేజర్ ఇవ్వలేదు. అలాంటి టాబ్లెట్ వాడితే మ్యాచ్ సమయంలో యాక్టివ్ గా ఉండ లేవంటూ చెప్పాడు. దీంతో దేశం కోసం నొప్పికి కూడా లెక్క చేయలేదు. ఇలాంటి నొప్పినైనా భరించడానికి  సిద్ధంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే దేశం కోసం వాడటం కంటే ఏది ఎక్కువ కాదు. నొప్పి భరించి భారత జట్టు తరఫున ఆడాను. ఆ మ్యాచ్ అదృష్టవశాత్తు డ్రాగా ముగిసింది. చివరికి 1-0 సిరీస్ గెలిచాము. తర్వాత డెంటిస్ట్ దగ్గరకు వెళితే అతను నా పంటిని పీకేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. టీమ్ ఇండియా తరఫున ఆడటం కంటే ఏది గొప్ప కాదని నేటి క్రికెటర్లకు ఒక ఉదాహరణ ఇచ్చాడు సునీల్ గావస్కర్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: