ఆరేళ్ల తర్వాత.. ఆ దేశ పర్యటనకు టీమిండియా?

praveen
సాధారణంగా భారత జట్టు ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళుతూ ఉండటం.. అక్కడ వరుసగా మూడు ఫార్మాట్లకు సంబంధించిన సిరీస్ లు ఆడుతూ ఉండటం చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక భారత పర్యటనకు విదేశీ జట్లను ఆహ్వానించడం కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు టీమిండియా దాదాపు అన్ని దేశాల పర్యటనకు వెళ్తుంది. కానీ భారత్ పర్యటనకు వెళ్లనీ దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ మాత్రమే. పాకిస్తాన్ భారత్ మధ్య ఉన్న విరోధం కారణంగా అటు క్రికెట్ మ్యాచ్ ల విషయంలో కూడా నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.


 అందుకే పాకిస్తాన్ భారత పర్యటనకు రావడం కాని.. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడం లేదని అస్సలు జరగదు. కేవలం అంతర్జాతీయ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక పాకిస్తాన్ మినహా మిగతా అన్ని దేశాల పర్యటనకు భారత్ వెళ్తుంది. కానీ గత ఆరేళ్ల నుంచి జింబాబ్వే పర్యటనకు వెళ్ళలేదు టీమిండియా జట్టు. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా సిద్ధమైంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు వెళ్తుందని ఇటీవలే క్రిక్ బజ్  పేర్కొంది.


 మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇక జింబాబ్వే  లో పర్యటించ పోతుందట టీమిండియా. అయితే  ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో టీ20 వన్డే సిరీస్ లు ఆడుతుంది టీమిండియా. ఈ పర్యటన ముగిసిన వెంటనే అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోతోంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో కూడా టీ20 వన్డే సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇక ఈ పర్యటన ముగిసిన తర్వాత అటు ఆగస్టులో 18, 20, 22 తేదీలలో జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడబోతుందట టీమిండియా. హరారే వేదికగా ఈ మ్యాచ్ లు జరగబోతున్నాయి. దీంతో గడిచిన ఆరేళ్లలో ఇండియా జింబాబ్వేలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: