అయ్య బాబోయ్.. దినేష్ కార్తిక్ కి ఇదే మొదటిసారట?

praveen
మొన్నటి వరకు కామెంటేటర్  గా మాత్రమే పరిమితమైన దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం అదరగొట్టేశాడు  అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో సూపర్ ఫినిషర్ పాత్రను పోషించాడు. ప్రతి  మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ తనదైన శైలిలో జట్టుకు విజయాన్ని అందించాడు. అతను మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ప్రతీ సారి కూడా దినేష్ కార్తీక్ ఏంటి ఇలా రాణించడం ఏంటి అని ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అంతలా తన అద్భుతమైన ప్రతిభను కనపరచిన దినేష్ కార్తీక్ టి20 ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్న టీ20 సిరీస్ లో కూడా అవకాశాన్ని దక్కించుకున్నాడు అనే చెప్పాలి. ఇక మొదటి మ్యాచ్లో పెద్దగా అవకాశం దక్కించుకోని దినేష్ కార్తీక్ రెండో మ్యాచ్ లో నిరాశపరిచాడు.  ఇక మూడో మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా పుంజుకుని మరోసారి అదరగొట్టాడు. ఇక ఇటీవల జరిగిన నాలుగవ మ్యాచ్ లో ఏకంగా 27 బంతుల్లో 55 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ తో కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు. ఇలా హాఫ్ సెంచరీతో అదరగొట్టిన దినేష్ కార్తీక్ అరుదైన రికార్డును సాధించాడు అని చెప్పాలి.

 అంతర్జాతీయ టి20లో పెద్దవయసులో హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్గా దినేష్ కార్తీక్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు మహేంద్రసింగ్ ధోని 37 సంవత్సరాల 229 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేయగా.. పెద్ద వయసు లో హాఫ్ సెంచరీ చేసిన భారత ప్లేయర్గా కొనసాగాడు ధోని. ఇప్పుడు దినేష్ కార్తీక్ ఈ రికార్డును బ్రేక్ చేసేసాడు. అంతేకాదు అంతర్జాతీయ టి20 కెరీర్లో దినేష్ కార్తీక్ కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.. మొన్నటివరకు దినేష్ కార్తీక్ కు అంతర్జాతీయ టీ20 లలో 47 పరుగులు అత్యధికంగా ఉండేవి. ఇప్పుడు మాత్రం మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు దినేష్ కార్తీక్. ఐపీఎల్ లో మాత్రం దినేష్ కార్తీక్ కి ఎన్నో హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: