అప్పుడు మొత్తుకున్నారు.. ఇప్పుడేమైంది : వసీం జాఫర్
ఇక పిచ్ ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లోనే ఫలితం ఏమిటి అన్నది తేలి పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలోనీ పిచ్ పై తనదైన శైలిలో ట్రోల్స్ చేశాడు. లార్డ్స్ మైదానంలో ఒకే రోజు టెస్టుల్లో 17 వికెట్లు కులాయి. బౌలర్ల స్కిల్ కనిపించింది. అయితే గతంలో ఇంగ్లాండ్ టీమిండియా అహ్మదాబాద్ టెస్టు ఇదే పరిస్థితి ఏర్పడింది.అప్పుడు పిచ్ ను తప్పుబడుతూ కొందరు మొత్తుకున్నారు.. మరి అప్పుడు మాట్లాడిన వారు ఇప్పుడు ఏం మాట్లాడ రా అంటూ చురకలు అంటించాడు వసీం జాఫర్.
అదే సమయంలో లార్డ్స్ మైదానంలో ఉన్న పిచ్ ట్రోల్ చేస్తూ సల్మాన్ ఖాన్ నటించిన రెడ్ సినిమా లోని ఒక పాటను జత చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. 2021లో టీమిండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ అహ్మదాబాద్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ ఆడింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 105 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. 145 పరుగులకు ఆలౌటైన టీమిండియా 22 పరుగుల స్వల్ప తేడాతో ఆధిక్యాన్ని సాధించడం గమనార్హం. ఆ సమయంలో నాణ్యతలేని పిచ్ కారణంగానే ఇలాంటిది జరిగిందంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.