నేను మళ్ళీ ఐపీఎల్ లోకి వస్తున్నా : ఎబి డివిలియర్స్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు టైటిల్ గెలిచిన జట్లకు ఉన్న క్రేజ్ తో సమానంగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా క్రేజ్ సంపాదించింది  ఒకప్పుడు డేనియల్ వెట్టోరి.. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఈ జట్టు ఐపీఎల్ ప్రస్థానాన్ని కొనసాగించి అన్న విషయం తెలిసిందే. 2014లో విరాట్ కోహ్లీ కెప్టెన్ చేపట్టిన తర్వాత బెంగళూరు జట్టు పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఇక ఈ ఏడాది బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లో అవకాశం కూడా దక్కించుకుంది.

 అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా గతంలో లీగ్ మ్యాచ్ ల సందర్భంలో విరాట్ కోహ్లీ ఎబి డివిలియర్స్ మళ్లీ రాబోతున్నాడు అంటూ ఒక క్లూ ఇచ్చాడు. ఎబి డివిలియర్స్ ను మళ్లీ వస్తాడా అంటే ఏమో చెప్పలేం.. కానీ అతన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఎబి డివిలియర్స్ మళ్ళీ బెంగళూరు జట్టులోకి రాబోతున్నాడు అన్న చర్చ మొదలయింది. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎబి డివిలియర్స్ ఆటగాడిగా జట్టులోకి వస్తాడా లేదా వేరే స్థానంలో బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

 ఈ క్రమంలోనే ఇటీవలే అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పాడు మిస్టర్ 360 ఎబి డివిలియర్స్. వచ్చే ఏడాది తాను బెంగళూరు జట్టుకు అందుబాటులో ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఏ పొజిషన్ లో ఉంటాను అన్న విషయాన్ని మాత్రం చెప్పలేను అంటూ ప్రకటించాడు ఏబి డివిలియర్స్. నా రెండో ఇంటికి మళ్లీ వస్తూ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. ఆ క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అంటూ తెలిపాడు. ఏదేమైనా మరోసారి ఏబీ డివిలియర్స్ బెంగళూరు జట్టులోకి వస్తున్నట్లు చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd

సంబంధిత వార్తలు: