రాహులా... లక్నో ఇలాగే ఆడితే ప్లే ఆప్స్ కి కష్టమే?

VAMSI
గత రాత్రి లక్నో మరియు బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాహుల్ నేతృత్వంలోని జట్టు ఓటమి పాలయింది. మ్యాచ్ జరిగాడు ముందు ఫేవరెట్ గా ఉన్న లక్నో జట్టు మొదటి అర్ధభాగం పూర్తయ్యే సరికి బెంగుళూరు ఫేవరెట్ అయింది. ఎంతలా అంటే మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయిన బెంగుళూరు పుంజుకుని నిర్ణీత 20 ఓవర్ లలో 181 పరుగులు చేసింది అంటే లక్నో బౌలింగ్ ఎంత వీక్ గా ఉందొ ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న లక్నో ఈ స్కోర్ ను చేధించడంలోనూ దారుణంగా ఫెయిల్ అయింది. తద్వారా బెంగుళూరు చేతిలో 18 పరుగులు తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి పడిపోయింది.
మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయిన బెంగుళూరును దాదాపుగా 10 ఓవర్ ల వరకు కట్టడి చేశారు. కానీ పరుగులు నియంత్రించలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా రన్ రేట్ మాత్రం ఆగలేదు. ఒత్తిడి తీసుకు రావడంలో రాహుల్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా డుప్లెసిస్ ను కట్టడి చేయడంలో లక్నో బౌలర్లు విఫలం అయ్యారు. నెమ్మదిగా ఆడుతూనే డుప్లిసిస్ లక్నో ను ప్రమాదంలోకి నెట్టేశాడు. ఇక బౌలింగ్ లో మరోసారి రవి బిష్ణోయ్ వికెట్లు తీయలేకపోగా పరుగులను కూడా నియంత్రించలేకపోయాడు.
అయితే 182 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కి వచ్చిన లక్నో ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. మొదటి పవర్ ప్లే లో లక్నో రెండు కీలక వికెట్లు కోల్పోయి 44 పరుగులు మాత్రమే చేసింది.  ఇక దీపక్ హుడాను సెకండ్ డౌన్ పంపకుండా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వలన హుడా ఇబ్బంది పడుతూనే ఆడి అనవసర షాట్ కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అయితే రాహుల్ అవుట్ అయిన దగ్గర నుండి రన్ రేట్ దారుణంగా పడిపోయింది. అప్పుడప్పుడు క్రునాల్ పాండ్య ఫోర్లు కొట్టినా అవేమీ జట్టు ఓటమిని ఆపలేకపోయాయి. నెక్స్ట్ మ్యాచ్ నుండి గేమ్ ప్లాన్ మార్చుకోకుంటే ప్లే ఆప్స్ చేరడం కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: