వైసీపీని దెబ్బ కొట్టేందుకు కూటమి... కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతుందా..?

Pulgam Srinivas
రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల కోసం ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగితే టీడీపీ , జనసేన , బీజేపీ పార్టీలు మూడు కలిసి పొత్తుల భాగంగా పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ వైయస్ షర్మిల అధ్యక్షతన కూడా సొంతగా బరిలోకి దిగింది. మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు , విశ్లేషకులు అంతా కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అలాగే కూటమి మధ్య గట్టి పోటీ ఉండబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేదు అని చెబుతూ వస్తున్నారు.

కాకపోతే వైసీపీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో పెద్ద ప్రభావాన్ని చూపకపోయినప్పటికీ ఓట్లు చీల్చడంలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది అని అభిప్రాయపడుతూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం దానిని వారు దాదాపుగా కన్ఫామ్ చేశారు. తాజాగా సాక్షి కథనం ప్రకారం... వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగుతుంది. టీడీపీ , జనసేన , బీజేపీ లు పొత్తులో భాగంగా పోటీలోకి దిగుతున్నాయి. ఇక్కడి వరకు ఓకే. కానీ షర్మిల అధ్యక్షతన బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కూటమి సైడే ఉంది.

వారు వైసీపీ ఓట్లను చీల్చేందుకు మాత్రమే పోటీలో ఉన్నారు. కూటమి , కాంగ్రెస్ అంతా కూడా చాలా సఖ్యంగా ముందుకు సాగుతున్నారు. ఒకరికి ఒకరు ఎంతగానో సపోర్ట్ చేసుకుంటున్నారు. వైసీపీ పార్టీకి పడే ముస్లిం మరియు మైనార్టీ ఓట్లను చీల్చేందుకు అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఓట్లు చీల్చడానికే షర్మిల అన్ని ప్రాంతాలలో అభ్యర్థులను నిలిపింది అని వారు చెబుతున్నారు. ఇక ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ బహిరంగ సభ టీడీపీ నేత పుత్త నరసింహారెడ్డి ఎస్టేట్స్ లో జరగడం ఇందుకు ఉదాహరణగా వారు చెబుతున్నారు. ఇలా వైసీపీ పార్టీకి రావలసిన ఓట్లను చీల్చేందుకే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది అని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: