అంపైర్ చేసిన పొరపాటు.. సన్రైజర్స్ కి కలిసి వచ్చింది?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు అటు రెండు జట్లకు సంబంధించిన ఆటగాళ్లలో మాత్రమే ఎక్కువగా ఒత్తిడి వుంటుంది అని అనుకుంటారు చాలా మంది. కానీ కేవలం ప్లేయర్స్ లో మాత్రమే కాదు ఆ మ్యాచ్ మొత్తాన్ని కూడా జడ్జి చేస్తున్నా అంపైర్లలో కూడా ఎంతగానో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ప్రతి బంతిని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. నో బాల్స్ వైడ్ బాల్స్, రన్ ఔట్స్, ఫోర్లు సిక్సర్లు ఇలా మైదానంలో ఉంటూ ప్రతి ఒకటి క్షుణ్ణంగా పరిశీలించి ఇక తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి ఒత్తిడి నడుమ ఎంతో మంది అంపైర్లు అప్పుడప్పుడు తడబడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 కొంతమంది మాత్రం ఎలాంటి ఒత్తిడిలో అయినా సరే కీలక నిర్ణయాలు తీసుకుని తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. మరికొంతమంది మాత్రం చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న పొరపాట్లు ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఇటీవల ఐపీఎల్ 2022 లో భాగంగా ఇదే జరిగింది. సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే అంపైర్లు ఎంతో ఒత్తిడిలో ఒక  నో బాల్ గుర్తించలేకపోయాడూ. సాధారణంగా తొలి పవర్ ప్లే లో ఆరు ఓవర్లు ముగిసిన తర్వాత అవుట్ ఫీల్డ్ లో నలుగురు ఫీల్డర్లను ఉంచాలి.

 ఇక మిగతా ఫీల్డర్లు 30 గజాల సర్కిల్ లో ఉండాలి.. ఇది రూల్ అయితే మ్యాచ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో తొలి బంతి వేసే సమయానికి సన్రైజర్స్ బౌలర్ ఊమ్రాన్ మాలిక్ అవుట్ ఫీల్డ్ లో ఐదో బౌలర్ గా ఉన్నాడు. అప్పటికే బంతి వేయడం బ్యాట్స్మెన్ పరుగు తీయడం జరిగిపోయింది. ఆ సమయంలో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సైమన్ డౌల్  నో బాల్ అని చెప్పడం క్లియర్గా వినిపించింది. అయితే అంపైర్ చూసి  ఉంటే కచ్చితంగా నో బాల్ వచ్చేది కానీ అవుట్ ఫీల్డ్ లో ఎంతమంది ఉన్నారు అన్న విషయం పట్టించుకోలేదు. మొత్తానికి అంపైర్  చేసిన పొరపాటు సన్రైజర్స్ కి కలిసి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుత ప్రస్తుతం వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: