RCB కొత్త కెప్టెన్.. మళ్ళీ కోహ్లీనే.. ఈ వీడియో చూడండి?

praveen
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న.. ఐపీఎల్ 2022 సీజన్ త్వరలో మొదలు కాబోతుంది అనే విషయం తెల్సిందే. ఇప్పటికే  బిసిసిఐ దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.  ఇక ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇకపోతే ఇటీవలే కొన్ని జంటలు తమ జట్టు కెప్టెన్ లను మెగా వేలం ముందు వదులుకున్నాయ్. ఇక మెగా వేలం తర్వాత కొత్త కెప్టెన్ లను ప్రకటించాయ్.


 అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. కానీ గత సీజన్లో మాత్రం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అన్న దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.



 ఈ క్రమంలోనే ఇక జట్టులోకి ఇటీవలే మెగా వేలంలో తీసుకున్న దినేష్ కార్తిక్ కెప్టెన్ ఇవ్వబోతున్నాడని ఒకసారి.. డూప్లెసిస్  కెప్టెన్ గా మారిపోతున్నాడు అని మరోసారి టాక్ వినిపించింది.  ఇలా కొత్త కెప్టెన్ పై ఎన్నో వార్తలు రావడం తప్ప బెంగళూరు జట్టు కెప్టెన్ ఎవరు అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ మాట్లాడిన ఒక వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. పునరుత్తేజం తో ఐపీఎల్ సీజన్ ఆరంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీకో విషయం చెప్పాలి అంటూ ప్రాన్స్ ను ఉద్దేశించి విరాట్ కోహ్లీ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఒ విషయం చెప్పబోతున్నాను అంటూ కోహ్లీ మాట్లాడిన ఆడియో ని మ్యూట్ చేసారు  ఇదంతా చూసిన తర్వాత మరోసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ  బాధ్యతలు చేపట్టబోతున్నాడు అంటూ అభిమానులు అనుకుంటూ ఉంటే.. మరి కొంతమంది అలా జరగాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: