రెండో టెస్ట్ మ్యాచ్ తో రోహిత్ అరుదైన రికార్డ్.. ఏంటో తెలుసా?
ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న అన్న విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ లో పూర్తి ఆదిపత్యాన్ని సాధించిన టీమిండియా ఘన విజయం సాధించింది. ఒక ఇన్నింగ్స్ తో పాటు 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే టెస్ట్ మ్యాచ్తో రోహిత్ శర్మ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోబోతున్నాడు. 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లో 400 మ్యాచ్ ల మైలురాయిని అందుకుంటాడు రోహిత్ శర్మ. ఇక ఈ ఘనత సాధించిన 35వ అంతర్జాతీయ క్రికెటర్ గా 9వ భారత క్రికెటర్గా రికార్డులకెక్కుతాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్ లతో టాప్ లో ఉన్నాడు.
ఆ తర్వాత లంక మాజీ ప్లేయర్లు మహేల జయవర్థనే (652), సంగక్కర (594), జయసూర్య (586) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ తరఫున సచిన్ తర్వాత ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509), విరాట్ కోహ్లి (457), మహ్మద్ అజహారుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402) రోహిత్ (399) కంటే ముందు ఉండటం గమనార్హం.