ఆ సమయంలో ఎమోషనల్ అయ్యా : శ్రేయస్ అయ్యర్

praveen
టీమిండియాలో మంచి టాలెంట్ ఉన్న యువ ఆటగాడిగా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ గతంలో తన కెప్టెన్సీ తో కూడా అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ కాపిటల్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో ఏకంగా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు శ్రేయస్ అయ్యర్. అతని కెప్టెన్సీ వ్యూహాలపై మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపించారు. అతనే ఫ్యూచర్ కెప్టెన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కానీ అనుకోని విధంగా అతను గాయం బారినపడటం తర్వాత ఢిల్లీ జట్టు కొత్త కెప్టెన్గా  రిషబ్ పంత్ ఎంపిక కావడం జరిగింది.


 ఇక ఇటీవలే మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ను రిటైన్  చేసుకోకుండా మెగా వేలంలోకి వదిలేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. కాగా అతని కోసం ఎన్నో ఫ్రాంచైజీలు పోటీపడగా చివరికి 12.25కోట్లకు అటు కోల్కతా నైట్రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇక మెగా వేలం సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఇటీవలే శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. మెగా వేలం జరుగుతున్నంత సేపు ఎంతో కంగారుగా అనిపించింది గుండె కొట్టుకునే వేగం కూడా ఎక్కువైపోయింది. ఇక నా పేరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు నా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక పోయాను అంటూ చెప్పుకొచ్చాడు.


 కోల్కత్తా ఫ్రాంచైజీ నా కోసం బిడ్ వేయడం నుంచి గమనిస్తూనే ఉన్నాను.. ఇక ఇతర పెద్ద ఫ్రాంచైజీలు కూడా నన్ను దక్కించుకోవడం కోసం బరిలోకి దిగాయి.. అప్పుడు నా చుట్టూ టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. నా గుండె కొట్టుకోవడం పెరిగింది. ఎమోషన్స్ కూడా ఆపుకోలేకపోయాను.. రిలాక్స్ గా ఉండేందుకు ట్రై చేసినప్పటికీ కాస్త ఆందోళనకు గురయ్యా.. అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. చివరికి కోల్కతా భారీ ధరకు కొనుగోలు చేయడం కాస్త అద్భుతంగా గర్వంగా కూడా అనిపించింది. కోల్కతా జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. జట్టు కోసం ఎంతో కష్టపడిన వారిని ఆదర్శంగా తీసుకొని జట్టును ముందుకు నడిపిస్తాను అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: