టెంపర్ కోల్పోయిన బుమ్రా.. ఇంత కోపం ఎప్పుడు చూసుండరు?

praveen
సాధారణంగా ఎంతో ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు అగ్రేసీవ్ గా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇరు జట్ల కు సంబంధించిన ఆటగాళ్ల మధ్య ఎంతో సీరియస్గా వాగ్వాదం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి ఇప్పటివరకు ఎన్నో మ్యాచ్ లలో జరిగాయి. కానీ ఒక్కొక్కసారి ఎంతో కూల్ గా ఉండే ఆటగాళ్లు సైతం సీరియస్ కావడం అటు ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక ఇలా ఆటగాళ్లు సీరియస్ కావడం చూసిన తర్వాత వామ్మో వారిలో ఎంత ఫైర్  దాగి ఉందా అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడుతున్న రెండో టెస్ట్ మూడోరోజు ఆట లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది.

 టీమిండియాలో జస్ప్రిత్ బూమ్రా ఎంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటారు జస్ప్రిత్ బుమ్రా. అంతే కాదు ఎప్పుడూ అగ్రేసీవ్ గా ప్రవర్తించడు. ఎంతో కూల్గా ఉంటు అందరికీ నవ్వుతూనే సమాధానం చెబుతూ ఉంటాడు. ఇప్పటివరకు దాదాపు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా జస్ప్రీత్ బుమ్రా ను  ఎంతో కూల్ గానే నవ్వుతూ చూసి ఉంటారు. కానీ ఇటీవల జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లోని మూడవ రోజు ఆటలో మాత్రం జస్ప్రిత్ బూమ్రా ఎంతో అగ్రెసివ్ గా కనిపించాడు.  ఆరున్నర అడుగుల ఎత్తున్న దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సన్ పైకి జస్ప్రిత్ బూమ్రా కోపంతో దూసుకు వెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 భారత్ రెండో ఇన్నింగ్స్ 54 ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇలా టెస్ట్ మ్యాచ్లో బాహాబాహీకి దిగిన ఇద్దరు ఆటగాళ్ళు కూడా అటు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ లో కలిసి ఆడిన ఆటగాళ్లే కావడం గమనార్హం. అంపైర్ జోక్యం చేసుకోవడంతో ఇద్దరు సర్దుకు పోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రెండో ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా స్కోర్ 8 వికెట్ల నష్టానికి 238 గా ఉంది. ఈ క్రమంలోనే జాన్సన్ బుమ్రా ను టార్గెట్ చేస్తూ వరుసగా బౌన్సర్ లను విసురుతూ  వచ్చాడు. కొన్ని కొన్ని బౌన్సర్లు బుమ్రా శరీరాన్ని ఎంతో బలంగా తాకాయ్.దీంతో బుమ్రా చిర్రెత్తి పోయాడు. కోపంతో జాన్సన్ వైపు దూసుకు వెళ్ళాడు. ఇద్దరు సీరియస్గా ఇద్దరూ మాట మాట అనుకున్నారు. అంతలో ఫీల్డ్ అంపైర్ సర్దిచెప్పడంతో ఇద్దరు మిన్నకుండిపోయారు. ఇక ఇదే కోపాన్ని కంటిన్యూ చేసినా జస్ప్రిత్ బూమ్రా రబాడా వేసిన మరుసటి ఓవర్లోనే సిక్సర్ కొట్టాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: