సఫారీల ఎదురీత... విజయానికి చేరువలో ఇండియా...!

VAMSI
సౌత్ ఆఫ్రికా మరియు ఇండియాల మధ్య సెంచూరియన్ పార్క్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇరు జట్ల లోని బౌలర్లు వికెట్ల పండుగ చేసుకుంటున్నారు. నిన్న ఒక్క రోజే 13 వికెట్లు నెల రాలాయి. మొన్ననే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమ్ ఇండియా తొందరగా సౌత్ ఆఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించాలని వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించారు. ఈ దశలో 174 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయింది. ఇండియా ఆటగాళ్లలో రిషభ్ పంత్ 34 పరుగులు ఒక్కడే టాప్ స్కోరర్. వరుసగా రెండు ఇన్నింగ్స్ లలోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలం కావడం విచారించదగ్గ విషయం.
సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబాడా మరియు మార్క్ జెన్సెన్ తలో 3 వికెట్లు తీసుకోగా, ఎంగిడి 2 వికెట్లు దక్కించుకున్నాడు.  తద్వారా సౌత్ ఆఫ్రికా లక్ష్యం 305 పరుగులు అయింది. వెంటనే రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు నెమ్మదిగా ఆడుతూ 94 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ మాత్రం అర్థ సెంచరీ చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. చివరిదైన ఈ రోజు ఇండియా ఇంకో 6 వికెట్లు సాధిస్తే విజయం దక్కించుకుంటుంది.
అలా కాకుండా సౌత్ ఆఫ్రికా 211 పరుగులు చేస్తే విజయం వారిని వరిస్తుంది. కానీ విజయ అవకాశం మాత్రం ఇండియాకే ఎక్కువగా ఉంది. మంచి జోరు మీదున్న ఇండియా బౌలర్లను అడ్డుకుని విజయం సాధించడం లేదా రోజంతా వికెట్లు కాచుకుని డ్రాగా ముగించడం అంత సులభమైన విషయం కాదు. టీమ్ లో సీనియర్లుగా ఉన్న డీకాక్ మరియు బావుమాలు ఇద్దరూ విలువైన ఇన్నింగ్స్ ఆడితే తప్ప ఓటమిని తప్పించుకోవడం అసాధ్యం. అయితే డ్రా కోసం తన పోరాటం ఏ విధంగా ఉండనుంది అనేది తెలియాలంటే ఇంకో గంట వేచి చూడాల్సిందే.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: