జగన్: విదేశీ పర్యట నుంచి రాగానే మొట్టమొదట చేసే పని అదే..?

Divya
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారం చేపడతామని చెప్పడమే కాకుండా 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఈ విషయం ఉత్కంఠతని పెంచుతోంది. విదేశీ పర్యటన ముగించుకొని జగన్ తాడేపల్లికి రిటర్న్ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలకు జగన్ నుంచి పిలుపు రావడం జరిగింది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత పార్టీ సాధించే సీట్ల పైన కూడా ఒక స్పష్టత వచ్చేలా తెలుస్తోంది. ఈ విషయం పైన మరొక సారి జగన్ మాట్లాడబోతున్నారు.

15 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని రేపటి రోజున ఏపీకి రాబోతున్న సీఎం జగన్.. ఈ విషయం విని వైసీపీ నేతలు చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ట్విట్టర్ లో కూడా   వైసీపీ పార్టీ మరొకసారి అధికారం అందుకోబోతుందంటూ తెలియజేశారు జగన్. ముఖ్యంగా వచ్చి రాగానే జగన్ రేపటి రోజున మీటింగ్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 5 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారట. ఆ తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కు వెళ్లబోతున్నారు.

అలా వెళ్ళిన తర్వాత పార్టీ కీలక నేతలతో జగన్ మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు కౌంటింగ్ పైన పార్టీ నేతలతో భేటీ అయి ఫలితాల గురించి మాట్లాడబోతున్నారట. దీంతో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఎల్లో మీడియా సహాయంతో టిడిపి నేతలు రెచ్చిపోవడంతో రాష్ట్రంలో జరిగిన కొన్నిచోట్ల కీలకమైన బదిలీలు పోస్టల్ బ్యాలెట్ ల పైన వైసిపి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ ఇలా ఎన్నికలవేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటి పైన కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్న జగన్ రేపు నేరుగా పార్టీ కీలక నేతలతో వీటిపైన చర్చించబోతున్నట్లు సమాచారం. 2019లో గెలిచే స్థానాల కంటే ఎక్కువగా గెలుస్తామని భీమ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: