అఫీషియల్ : "ఇండియన్ 2" ఆడియో లాంచ్ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సంవత్సరాల క్రితం ఇండియన్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు లో భారతీయుడు అనే పేరుతో విడుదల అయింది. అప్పటికే కమల్ హాసన్ కు మంచి క్రేజ్ ఉండడం , అలాగే శంకర్ కూడా ఆ ముందు దర్శకత్వం వహించిన సినిమాలు మంచి విజయాలు సాధించి ఉండడంతో ఈ మూవీ భారీ అంచనాల నడుమ అటు తమిళ్ , ఇటు తెలుగు భాషలలో విడుదల అయింది.
 

ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను అటు తమిళ్ ఇటు తెలుగు లో రాబట్టింది. ఇక ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ హీరో గా శంకర్ ఇండియన్ 2 అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా తెలుగు లో భారతీయుడు అనే టైటిల్ తో విడుదల కానుంది.

ఇకపోతే ఈ సినిమా హిందీ లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక పాటను కూడా మేకర్స్ విడుదల చేశారు. దానికి మంచి  రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ మూవీ యొక్క ఆడియో లాంచ్ ను రేపు నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా ... లేక ప్రొడక్షన్స్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: