భోజనం పెట్టమంటే తిట్టి తరిమేశారు.. అంటూ ఎమోషనలైన ఉపేంద్ర..!

Suma Kallamadi
తెలుగు సినీ పరిశ్రమతో పాటు కనడ చిత్ర పరిశ్రమలో నటుడు ఉపేంద్ర అంటే తెలియని వారెవరు ఉండరు. నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన అనేక సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఉపేంద్ర సినీ పరిశ్రమలో దాదాపు అన్ని పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నడు. ఉపేంద్ర కేవలం నటుడు గానే కాకుండా దర్శకుడుగా, రచయితగా, సంగీత దర్శకుడుగా, నేపథ్య గాయకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక నటుడు ఉపేంద్ర శ్రీకాంత్ హీరోగా నటించిన 'కన్యాదానం' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
కన్యాదానం సినిమాలో సెకండ్ హీరోగా నటించిన ఆయన ప్రేక్షకుల ఆదరణ పొందాడు. అనంతరం సినీ పరిశ్రమలో కన్నడ తోపాటు తెలుగులో కూడా అనేక సినిమాలు విడుదలయి విజయాన్ని సొంతం చేసుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా విలన్ గా ఉపేంద్ర నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికీ  తెలిసినదే. ఒక కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగులో కూడా మంచి పేరు సొంతం చేసుకోవడం.. ఉపేంద్ర ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్లోకి తెలిసిన విషయమే. సినీ ఇండస్ట్రీ మొదటిలో ఉపేంద్ర ఎదురైన సన్నివేశాలను ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.. ఉపేంద్ర ఇంటర్వ్యూ వారితో మాట్లాడుతూ., నేను ఏమీ లేకుండా వచ్చాను. అదే నాకు ప్లస్ పాయింట్. జీరో నుండి మొదలు పెట్టుకొని పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. ఏదైనా వస్తే అది నాకు గొప్ప. అలాగే చాలా అదృష్టం అని చెప్పకు వచ్చారు. ఇక మొదట్లో ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో అక్కడ భోజనం పెడుతున్నారు. నేను కూడా అక్కడకు ప్లేటు తీసుకొని వెళ్తే.. అక్కడ ప్రొడక్షన్ బాయ్ భోజనం లేదు పోరా అంటూ నన్ను అక్కడి నుంచి తరిమేశారని ఉపేంద్ర ఎమోషనల్ అయ్యారు. అనంతరం నేను హీరోగా చేస్తున్న అన్ని సినిమాలకు దాదాపు అదే ప్రొడక్షన్ బాయ్ పని చేశాడు. కానీ నేను ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చాను. ఆ టైంలో నా పరిస్థితి అలా ఉంది., అందుకే అతను అలా మాట్లాడాడని నేను అనుకున్నాను. అప్పుడు ఆ ప్రొడక్షన్ బాయ్  చేసిన పనిని గుర్తు పెట్టుకొని నేను కూడా అలానే ప్రవర్తించడం మంచిది కాదని ఉపేంద్ర తెలియజేశారు. ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్  వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను చుడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: