గెలుపు టీడీపీదా.. వైసీపీదా.. నేడే ఒక రూపం రాబోతుంది?

praveen
ఏపీలో ఈసారి అధికారం ఎవరిది? సీఎం జగనా... లేకపోతే చంద్రబాబా.. లేకపోతే కూటమికి, వైసీపీకి మధ్య హంగ్ ఏర్పడి మళ్ళీ గందరగోల పరిస్థితులు నెలకొంటాయా.. ఈసారి పోలింగ్ అయితే భారీగానే నమోదు అయింది. ఇక ఇలా పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ పాయింట్ గా మారబోతుంది.. అధికారం మాదే అని అందరూ నమ్ముతున్నారు. కానీ ఎవరి నమ్మకం నిలబడబోతుంది. ఇక ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి చర్చే జరుగుతుంది.

 మే 13వ తేదీన అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇక అంతకుముందు ఎన్నో సర్వేల ఫలితాలు, పలువురు విశ్లేషకుల అంచనాలు, ఇక ఏపీ ఎన్నికల ఫలితాలపై మరింత ఆసక్తిని పెంచుతూ ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తే ఇక ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఒక అంచనా వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇలా ఫలితాలకు ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్  దాదాపుగా నిజం అవుతూ ఉంటాయి అని చెప్పాలి.

ఈ క్రమం లోనే ఆంధ్రా లో ఫలితాల పై ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే రేపు ఇక సాయంత్రం వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఈసారి అధికారం ఎవరిది అనే విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ గుడ్డిగా నమ్మడానికి కూడా ఉండదు. ఎందుకంటే గతంలో ఛత్తీస్గడ్  మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తారు మారు  అయ్యాయి. అందుకే ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక రూపం వచ్చిన వాటిని పూర్తిగా నమ్మలేము అని విశేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: