మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . నయన తార ఈ సినిమా లో హీరోయిన్గా నటిస్తోంది . టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు . వెంకటేష్ పాత్ర నిడివి ఈ సినిమాలో తక్కువే ఉ న్నా కూడా సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పే కీలకమైన పాత్ర లో వెంకటేష్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. వెంకటేష్ సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి మీసాల పిల్ల అనే సాంగ్ను విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మి వేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొత్తం కర్ణాటక థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. ఆ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా యొక్క మొత్తం కర్ణాటక థియేటర్ హకులను స్వాగత్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి స్వాగత్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఈ సినిమాను కర్ణాటక ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.