ఆ స్టార్ నిర్మాణ సంస్థ చేతికి మొగ్లీ హక్కులు.. హిట్ టాక్ వస్తే ఇక అంతే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు రోషన్ కనకాల తాజాగా మొగ్లీ అనే సినిమా లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా ... ప్రముఖ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి బండి సరోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 12 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ మూవీ కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేటర్ హక్కులను ఓ భారీ క్రేజ్ ఉన్న సంస్థ కొనుగోలు చేసింది.
 


అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం , ఈ మూవీ కి సంబంధించిన నైజాం థియేటర్ హక్కులను అద్భుతమైన క్రేజ్ కలిగిన మైత్రి సంస్థ దక్కించుకోవడంతో ఈ సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే నైజాం ఏరియాలో ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: