అలాంటి ఘనత సాధించిన తొలి తెలుగు దర్శకుడిగా సందీప్ వంగా..శభాష్..!

Thota Jaya Madhuri
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటీవలి కాలంలో వరుసగా గర్వకారణంగా నిలుస్తున్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా పేరు ఎప్పుడూ ముందే ఉంటుంది. అర్జున్ రెడ్డి ద్వారా సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, అదే కథను బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌గా తీర్చిదిద్ది హిందీ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటారు. ఈ రెండు చిత్రాలు కలిపి ఆయనకి అపర ఖ్యాతిని తీసుకొచ్చినప్పటికీ, రణబీర్ కపూర్‌తో చేసిన ‘యానిమల్’ ఆయనను మరో స్థాయికి తీసుకెళ్లింది. విపరీతమైన రెస్పాన్స్, రికార్డు రేంజ్ కలెక్షన్లతో యానిమల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, హిందీ ఇండస్ట్రీలో సందీప్ వంగా డిమాండ్‌ను మరింత పెంచింది.



ప్రస్తుతం వంగా ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్–వరల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ స్టార్‌డమ్, సందీప్ వంగా టేకింగ్‌ స్టైల్‌ కలిసిన ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను టీ–సిరీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.ఇదిలా ఉండగా, సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సందీప్ వంగా టీ–సిరీస్ సంస్థతో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో అత్యంత ప్రముఖమైన ప్రొడక్షన్ హౌస్‌తో ఇంత పెద్ద డీల్ చేసుకోవడం ద్వారా ఒక టైం‌లో మూడు ప్రాజెక్టులు సైన్ చేసిన తొలి తెలుగు దర్శకుడిగా సందీప్ వంగా ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. ఇది తెలుగు దర్శకుల పరిధిని, ప్రాబల్యాన్ని హిందీ ఇండస్ట్రీకి మరింత స్పష్టంగా చూపించిన ఘనతగా చెప్పవచ్చు.



ఈ డీల్ ప్రకారం మొదటి సినిమా ప్రభాస్‌తో ‘స్పిరిట్’, అయితే మిగిలిన రెండు చిత్రాలను ఎవరి‌తో చేస్తారో అన్నది ప్రస్తుతం అత్యంత ఆసక్తికర ప్రశ్నగా మారింది. బాలీవుడ్‌ టాప్‌ హీరోలతోనా? లేక కొత్త కాంబినేషన్లతోనా? అని అభిమానులు, సినీ పరిశ్రమ ఏదో ఒక అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తోంది. సందీప్ వంగా ఇప్పటికే తన కథ చెప్పే తీరు, మానవ భావోద్వేగాలను ఘాటుగా చూపే స్టైల్, భారీ స్కేల్ నేరేషన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద బాలీవుడ్‌ డీల్ సైన్ చేయడం ఆయన స్థాయిని మరో మెట్టు పైకెక్కించింది.తెలుగు సినిమా తరఫున ఇది గర్వించదగ్గ విజయం అని చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: