టివి: బిగ్ బాస్ -8 లో వీళ్లు వచ్చారంటే రచ్చ రచ్చే..!

Divya
బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కార్యక్రమంలో బిగ్ బాస్ షో కూడా ఒకటి..ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకొని పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ -7 పూర్తిచేసుకుంది. తాజాగా 8 వ సీజన్ ప్రారంభానికి పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటిస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈసారి మేకర్స్ సైతం సరికొత్త వినోదాన్ని పంచడం కోసం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సీజన్లో పాల్గొనే వారిలో ముఖ్యంగా నయని పావని పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె గత సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో మరొక కంటెస్టెంట్ ని సేవ్ చేసే క్రమంలో ఈమెను ఒక వారానికి ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. అందుకే ఈసారి కూడా హౌస్ లో ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈమే తో పాటు మరికొంత మంది యూట్యూబ్ స్టార్స్ కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గతంలో జబర్దస్త్ లో కనిపించిన కిరాక్ ఆర్పీ ప్రస్తుతం యూట్యూబ్లో కూడా బాగా ఫేమస్ అవడంతో అవకాశం వచ్చినట్లుగా సమాచారం. వీరితో పాటు బుల్లెట్ భాస్కర్ కుమారి ఆంటీ, బర్రె లక్క, రీతు చౌదరి, యాంకర్ నిఖిల్, వంశీ తదితరులు పాల్గొని అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విన్న బిగ్ బాస్ అభిమానులు సైతం వీరంతా సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చారంటే వినోదం సంగతి పక్కన పెడితే కచ్చితంగా నానా రచ్చ చేస్తారని తెలియజేస్తున్నారు. ఈసారి హోస్టుగా నాగార్జున వ్యవహారిస్తరా లేదా అనే విషయం పైన కూడా సందేహంగానే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: