కోహ్లీ ఫోన్ స్విచాఫ్.. కోచ్ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుత భారత క్రికెట్లో కెప్టెన్సీ గురించిన చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో టీమిండియా  కొత్త కెప్టెన్గా  రోహిత్ శర్మ ను నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ విషయంలో బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకో పోతుంది అన్న దానిపై ఆసక్తికర చర్చ నడిచింది. ఈ క్రమంలోనే అందరూ అనుకున్నట్లు గానే విరాట్ కోహ్లీ నీ కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మ ను వన్డే జట్టుకు కెప్టెన్గా నియమించింది బీసీసీఐ. అయితే గతంలో టి20 కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ వన్డే, టెస్ట్ లకు కెప్టెన్గా  కొనసాగుతానని తెలిపారు.

 అయితే ఇటీవలే ఇక విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించి రోహిత్ శర్మని వన్డే జట్టుకు కెప్టెన్గా చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. కోహ్లిని సంప్రదించకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించారు అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకున్న రోజే అతని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నాము అంటూ బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.

 ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ  నుంచి తప్పించిన తర్వాత నేను కోహ్లీతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. అతని ఫోన్ స్విచాఫ్ ఉంది. అయితే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకో వద్దు అంటూ కోహ్లీకి చెప్పాను అంటూ గంగూలీ ఇచ్చిన వివరణ తనను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ రాజ్ కుమార్ శర్మ వ్యాఖ్యానించారు. నాకు తెలిసి సౌరవ్ గంగూలీ కోహ్లీకి ఏమీ చెప్పలేదు.. కెప్టెన్సీ నుంచి
 ఎందుకు తప్పించారు అన్న కారణం సెలక్షన్ కమిటీ చెప్పలేదు అంటు రాజ్ కుమార్ శర్మ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: