టి20 వరల్డ్ కప్ : ఇద్దరు కీపర్లు ఒకే ఫ్రేమ్ లో?
న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న డీవాన్ కాన్వే చేతికి గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యాడు. ఇటీవలే క్లిష్ట పరిస్థితుల్లో న్యూజిలాండ్ జట్టుకు విజయాన్ని అందించిన కాన్వే దూరం కావడం జట్టుకు ఒక పెద్ద మైనస్ గా మారిపోయింది. అయితే ఒక వైపు చేతికి గాయం అయినప్పటికీ అటు జట్టు ప్రాక్టీస్ సెషన్ ల్ మాత్రం తోడ్పాటు అందిస్తూనే ఉన్నాడు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కాన్వే. ఇటీవలే ప్రాక్టీస్ సెషన్ కు హాజరయ్యాడు
ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో కాన్వే కి బదులు టీమ్ స్టిఫర్ట్ బరిలోకి దిగుతాడు అని భావిస్తున్నారు. ఇటీవలే కాన్వే అతనికి సలహాలు సూచనలు ఇస్తూ మైదానంలో కనిపించాడు. కుడి చేతికి గాయం అయినప్పటికీ ఎడమచేతితో బంతులు విసిరూతు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కివీస్ జట్టును కాపాడాడు కాన్వే. కానీ కీలక సమయంలో అవుట్ కావడంతో అసహనానికి గురై ఏకంగా చేతిని బ్యాడ్ కేసి కొట్టుకున్నాడు. ఆ తర్వాత బలంగా బ్యాట్ విసరడంతో చేతికి గాయం అయింది. దీంతో ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యాడు. ఇటీవలే కాన్వే ఏకంగా కీపింగ్ లో మెళుకువలు నేర్పిస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తూ ఇద్దరికీ కీపర్లు ఒకే ఫ్రేమ్లో అంటూ కామెంట్ పెట్టినది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.