T20 WORLD CUP: భార‌త్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో 14 ఏళ్ల త‌ర్వాత ఆ ముగ్గురు...!

VUYYURU SUBHASH
టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 12 పోటీలో ఈ రోజు నుంచి దుబాయ్ - యూఏఈ దేశాల్లో ప్రారంభ మ‌వుతున్నాయి. పాకిస్తాన్ - భార‌త్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కోసం యావ‌త్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఓ స్పెషాలిటీ ఉంది. 2007 టి 20 ప్రపంచకప్‌ జరిగి దాదాపు 14 సంవత్సరాలు అవుతోంది. ఆ వ‌రల్డ్ క‌ప్ ఫైనల్లో భార‌త్ - పాకిస్తాన్ త‌ల‌ప‌డ‌గా భార‌త్ గెలిచింది.

ఈ ఫైనల్లో రెండు జ‌ట్ల నుంచి ఆడిన ముగ్గురు క్రీడాకారులు మ‌ళ్లీ రేప‌టి వేళ భార‌త్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా బ‌రిలోకి దిగుతున్నారు. 14 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ అదే భార‌త్ - పాకిస్తాన్ అదే టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ ఆడుతుండ‌గా.. మళ్లీ ఈ ముగ్గురు ఆట‌గాళ్లు కూడా బ‌రిలో ఉండ‌డం ఆస‌క్తి గా మారింది. భార‌త్ నుంచి రోహిత్‌ శర్మ , పాకిస్తాన్‌ నుంచి మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్ లు ఈ మ్యాచ్‌లో ఆడుతున్నారు.

ఈ 14 ఏళ్ల త‌ర్వాత చూస్తే రోహిత్ శ‌ర్మ ఇప్పుడు మ‌న టీంకు వైస్ కెప్టెన్ గానే కాకుండా స్టార్ ఓపెన‌ర్ గా ఉన్నారు. 2007 ఫైనల్లో రోహిత్‌ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. ఆ ఫైన‌ల్ విజ‌యం లో రోహిత్ పాత్ర ఎంతో కీల‌క‌మైంది. భార‌త్ ఆ ఫైనల్లో కేవ‌లం 5 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఇక పాక్ వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ మహ్మద్ హఫీజ్‌ 2007 ఫైనల్లో ఓపెనింగ్ వ‌చ్చి ఆర్పీ సింగ్ బౌలింగ్ లో స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరిగాడు.

ఇక నాటి ఫైనల్లో మ‌రో వెట‌ర‌న్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్ ఫైన‌ల్లో విఫ‌ల‌మ‌య్యాడు. మ‌రి ఈ ముగ్గురు రేపటి మ్యాచ్‌లో ఏం చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: