వామ్మో.. ఒక్క మ్యాచ్ లో ఇ న్ని రికార్డుల?

praveen
ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అటు ప్లే ఆఫ్ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది.  కేవలం నామమాత్రంగా మాత్రమే మ్యాచ్ ఆడుతుంది. కానీ ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం ప్లే ఆప్ కి అర్హత సాధించడానికి నాలుగవ స్థానం కి వెళ్లడానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేసింది అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఎంతలా పోరాటం చేసినప్పటికీ చివరికి ప్లే ఆఫ్ బేర్తు మాత్రం దక్కలేదు. ఏకంగా భారీ స్కోర్ చేసి 42 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ  రన్ రేటు తక్కువగా ఉండటం కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించి ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి.



 అయితే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 235పరుగులు చేసింది.. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సన్రైజర్స్ జట్టు 193 పరుగులు చేసింది.  కాగా సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరు ఎంతో ఉత్కంఠభరితంగా మారిపోయింది అనే చెప్పాలి. ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ గెలిచినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అయితే నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అనేక రికార్డులు నమోదు కావడం గమనార్హం.



 సాధారణంగా ఏదైనా మ్యాచ్ జరిగినప్పుడు ఒకటి లేదా రెండు రికార్డును నమోదు కావడం చూస్తూ ఉంటాం. కానీ నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మాత్రం ఒకటి కాదు రెండు కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే రికార్డులు నమోదు కావడం గమనార్హం. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో ఈ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. ఇక అదే సమయంలో ఒకే మ్యాచ్ లో ఐదు క్యాచ్లు పట్టిన ప్లేయర్ గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు నబి రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇప్పుడు వరకు ముంబై ఇండియన్స్ చేసిన స్కోర్ లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 10వ ఓవర్ లో ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది ఇది కూడా అత్యధికమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: