ఆఫ్ఘన్లో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. తాలిబాన్ల కు, దేశ బలగాల కు మధ్య జరుగుతున్న హింసాత్మక పోరు లో సాధారణ పౌరులు బలవుతున్నారు. తాజా గా బాల్ఖ్ ప్రావీన్స్‌లోని మజార్- ఏ- షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు తాలిబాన్లు ప్రకటించడంతో.... భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లోని భారతీయులు ప్రత్యేక విమానం లో మజర్ ఈ షరీఫ్ నగరం నుంచి స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది. వారి కోసం ప్రత్యేక విమానం అందుబాటులో ఉంచింది కేంద్రం. మజార్- ఏ- షరీఫ్ అఫ్గాన్ లోని నాలుగో పెద్ద నగరం.
తాలిబన్లు ఇప్పటికే ఆ నగరంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమిం చుకున్నారు. గత మే నెల నుంచి ఆఫ్ఘన్‌లోని అమెరికా బలగాలు కూడా వెనక్కి వచ్చేస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దేశంలోని పలు జిల్లాలు తాలిబన్ల చేతుల్లోకి వెళుతుండడం తో.... అక్కడి ప్రభుత్వ మరికొద్ది రోజుల్లోనే తాలిబన్ల వశమవుతుందని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే... ఇది ఇలా ఉండగా... అఫ్ఘనిస్థాన్ అల్లర్లపై తాజాగా సన్ రైజర్స్ ఆల్ రౌండర్, అఫ్ఘనిస్తాన్ ఫేమస్ క్రికెటర్ రషీద్ ఖాన్ స్పందించాడు.
తన దేశాన్ని ఎలాగైనా తాలిబన్ల దాడుల నుంచి ఎలాగైనా కాపాడాలని ప్రపంచ దేశాలను రషీద్ ఖాన్ కోరాడు. ప్రస్తుతం తన దేశమైన ఆఫ్ఘన్ లో అసలు శాంతి యూత పరిస్థితులు లేవని... తాలిబన్లు తమ దేశాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని.. అలాగే అత్యంత దారుణంగా మారణ హోమం సృష్టి స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు రషీద్ ఖాన్. అందుకే తన దేశాన్ని ఎలాగైనా శాంతి యుతంగా మార్చాలని కోరాడు రషీద్ ఖాన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా.. రషీద్ ఖాన్ వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం రషీద్ ఖాన్ చేసిన పోస్ట్... సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.