కోహ్లీ చేసిన పనికి కన్నీళ్లు వచ్చాయి.. నటరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు..?
కీలక సమయంలో వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలకపాత్ర వహించాడు. ఆస్ట్రేలియా టూర్ లో అతని కెరీర్లోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు నటరాజన్ . తొలుత టీ20 ఫార్మాట్ లో మాత్రమే ఎంపికైన నటరాజన్ ఆ తర్వాత వన్డే.. తర్వాత టెస్ట్ సిరీస్ లలో కూడా టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే టి20 సిరీస్ లో భాగంగా విరాట్ కోహ్లీ తనకు ఇచ్చిన గౌరవానికి కన్నీళ్ళు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు నటరాజన్. టి20 సిరీస్ గెలవగానే ట్రోఫీని తెచ్చి విరాట్ కోహ్లీ మొదట తన చేతుల్లోకి పెట్టినప్పుడు కన్నీళ్లు ఆగలేదు అంటూ తెలిపారు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ని 2-1 తేడాతో భారత జట్టు గెలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత టీ 20 ట్రోఫీ తీసుకువచ్చి కెప్టెన్ విరాట్ కోహ్లీ తన చేతుల్లో పెట్టడం కన్నీళ్లు ఆగలేదు అంటూ తెలిపాడు.. జట్టుతో కలిసి పక్కన నిల్చుని ఉన్న నాకు కోహ్లీ అంతలా గౌరవిస్తాడు అని ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆనందంతో కన్నీళ్లొచ్చాయి అంటూ తెలిపాడు.. అయితే గతంలో కూడా ధోనీ ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించాడు అన్న విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్గా వ్యవహరించిన సమయంలో ట్రోఫీ గెలిచిన తర్వాత దాన్ని నేరుగా తీసుకొచ్చి అరంగేట్రం చేసిన ఆటగాడు చేతికి అందించేవాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.